ట్విట్టర్ సీఈవోకు ఎలాన్ మాస్క్ సవాల్
ట్విట్టర్లో నిర్వహిస్తున్న అనధికారిక స్వతంత్ర వ్యవస్థలు (నకిలీఖాతాలు) ఎన్ని ఉన్నాయో, ట్విట్టర్లో వాటిశాతం ఎంత అనే విషయంపై బహిరంగ చర్చకు రావాలని ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్‌కు ఎలాన్ మస్క్ సవాలు విసిరారు. ట్విట్టర్లో 5 శాతం ఖాతాలు నకిలీవేనని ప్రజలకు సవాల్ చేశారు. ట్విట్టర్లో నకిలీ యూజర్లు, ఖాతాలు 5 శాతం కన్నా తక్కువగా ఉన్నాయంటారా? అనే విషయంపై ఆయన పోల్ కూడా నిర్వహిస్తున్నారు. కాగా మస్క్ వాదనలను ట్విట్టర్ కొట్టిపడేసింది. 44 బిలియన్ డాలర్ల ఒప్పందంపై వెనకువెళ్లిన మస్క్ వాదానల్లో పస లేదని పేర్కొంది. కాగా ట్విట్టర్‌లోని 100 ఖాతాలను సమూనాగా తీసుకుని పరిశీలిద్దామని, అన్నీ నిజమైన ఖాతాలే అని తేలితే ఒప్పందంతో ముందుకు వెళతామని ఆయన అన్నారు.






