అమెరికా విపణిలోకి డాక్టర్ రెడ్డీస్ ఔషధం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సిప్రొడెక్స్ జనరిక్ ఔషధాన్ని అమెరికా విపణిలో విడుదల చేసింది. సిప్రోఫ్లాగ్జాసిన్ 0.3 శాతం, డెక్సామెథసోన్ 0.1 శాతం కలిపిన ఔషధమే సిప్రోడెక్స్. చెవిలో ఇన్ఫెక్షన్ల చికిత్స కోసం ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. అమెరికాలో తాము విక్రయించే ఔషధాల శ్రేణిని విస్తరిస్తున్నామనడానికి ఈ ఔషధం నిదర్శనమని డాక్టర్ రెడ్డీస్ సీఈఓ (నార్త్ అమెరికా జనరిక్స్) మార్క్ కికుచి అన్నారు. అమెరికాలో సిప్రొడెక్స్ ఔషధ వార్షిక అమ్మకాలు 450 మిలియన్ డాలర్ల (సుమారు రూ.3,400 కోట్ల) మేరకు నమోదవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్ జనరిక్ సిఫ్రోడెక్స్ ఔషధం 7.5 ఎంఎల్, 10 ఎంఎల్ బాటిలో లభ్యమవుతుంది.






