అమెరికా విపణికి డాక్టర్ రెడ్డీస్

అమెరికా విపణిలో ఆల్బెండజోల్ ఔషధాన్ని విడుదల చేసినట్లు డాక్టర్ రెడ్డీస్ ప్రకటించింది. ఆల్బెంజా, దాని జనరిక్ ఔషధ అమ్మకాలు అమెరికాలో గత ఏడాది కాలంలో 27 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఔషధం జీఎస్‍కేకు చెందిన ఆల్బెంజా అనే బ్రాండుకు జనరిక్ ఔషధం. పారసైటిక్ వార్మ్ ఇన్ఫెక్షన్లను అదుపు చేయడానికి ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు.