అమెరికా మార్కెట్లోకి డాక్టర్ రెడ్డిస్ ఔషధం
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ అమెరికా మార్కెట్లో సినకాల్సెట్ ట్లాబ్లెట్లను విడుదల చేసింది. యూఎస్ఎఫ్డీఏ అనుమతితో 30ఎంపీజ 60ఎంజీ, 90ఎంజీ డోసుల్లో ఈ ట్యాబ్లెట్లను ఆవిష్కరించినట్లు డాక్టర్ రెడ్డీస్ వెల్లడించింది. ఆమ్జెన్ ఇంక్., అనే కంపెనీకి చెందిన సెన్సిపార్ అనే బ్రాండుకు, ఇది జనరిక్ ఔషధం. కిడ్నీ వ్యాధులతో డయాలసిస్ మీద ఉన్న రోగుల్లో హైపర్థైరాయిడిజమ్కు చికిత్సలో ఈ మందు వినియోగిస్తారు. గత ఏడాది కాలంలో సెన్సిసార్ ఔషధం 312 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2300 కోట్లు) అమ్మకాలు నమోదు చేసింది. ఈ ఔషధాన్ని ఇప్పటికే యూఎస్ మార్కెట్లో పలు భారతీయ కంపెనీలు విడుదల చేశాయి. అరబిందో ఫార్మా, పిరమిల్ ఎంటర్ప్రైజెస్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి.






