ట్రంప్ కు పాజిటివ్ …అమెరికా మార్కెట్లు పతనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కరోనా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. ఈ వార్త వ్యాపించగానే అమెరికా మార్కెట్లు పతనం అయ్యాయి. ట్రంప్ పాజిటివ్ వచ్చినట్లు తేలగానే డౌ 400 పాయింట్లు కోల్పోయింది. డౌ జోన్స్ షేర్లలో 1.6 శాతం తగ్గినట్లు విశ్లేషకులు వెల్లడించారు. ట్రేడింగ్‌లో నాస్డాక్ కూడా 1.8 శాతం తగ్గుదల చూపించింది. వాస్తవానికి ట్రంప్ సలహాదారుకు కరోనా వైరస్ సంక్రమించినట్లు వార్తలు రాగానే అమెరికా స్టాక్ మార్కెట్లు డీలాపడ్డాయి. హోప్ హిక్స్‌కు వైరస్ సోకడంతో ట్రంప్ దంపతులు పరీక్ష చేయించుకున్నారు. వారు పరీక్షలో పాజిటివ్ గా తేలినట్లు డాక్టర్ తెలిపారు. ప్రస్తుతం ట్రంప్ క్వారెంటైన్లో ఉన్నారు. ట్రంప్ వైరస్ వార్త విన్న తర్వాత ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గుతున్నట్లు తెలుస్తోంది.






