ఎస్బీఐ కొత్త చైర్మన్ దినేశ్ ఖరా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్‌గా దినేశ్ ఖర నియమితులయ్యారు. మూడేండ్లపాటు ఆయన ఎస్బీఐ చీఫ్‌గా కొనసాగనున్నారు. బుధవారం నుంచి దినేశ్ నియామకం అమల్లోకి వస్తుంది. ఎస్బీఐ అధిపతిగా దినేశ్‌ను సూచిస్తూ బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో చేసిన సిఫార్సుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ రజ్నీశ్ కుమార్ మూడేండ్ల పదవీకాలం కూడా ఇదే రోజున ముగిసింది. మరోవైపు దినేశ్ ఎస్బీఐ చైర్మన్‌గా నియమితులు కావడంతో బ్యాంక్ నలుగురు ఎండీల్లో ఓ స్థానం ఖాళీ అయ్యింది. ఈ నెలాఖర్లో మరో ఎండీ అరిజిత్ బసు పదవీకాలం కూడా తీరిపోతుండటంతో బ్యాంక్‌కు ఇద్దరు కొత్త ఎండీలు రావాల్సి ఉన్నది.






