WhatsApp: భారతీయులకు షాక్ ఇచ్చిన వాట్సాప్ .. 83,668 ఖాతాలపై నిషేధం

ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ 3,962 కంటే ఎక్కువ స్కైప్ ఐడీలను, డిజిటల్ అరెస్ట్ కోసం ఉపయోగించిన 83,668 వాట్సాప్ (WhatsApp) ఖాతాలను గుర్తించి బ్లాక్ చేసిందని హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) పార్లమెంటులో తెలిపారు. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లతో సహా సైబర్ నేరాలను సమగ్రంగా, సమన్వయంతో ఎదుర్కోవడానికి యంత్రాంగాన్ని బలోపేతం చేయడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కో ఆర్డినేషన్ సెంటర్ (Coordination Center) ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 28.02.2025 వరకు, పోలీసు అధికారులు నివేదించిన 7.81 లక్షలకు పైగా సిమ్ కార్డులు (SIM cards) , 2,08,469 ఐఎంఈఐలను భారత ప్రభుత్వం బ్లాక్ చేసింది అని మంత్రి పేర్కొన్నారు.
ఆర్థిక మోసాలను వెంటనే నివేదించడానికి, మోసగాళ్లు నిధులను స్వాహా చేయడాన్ని ఆపడానికి సిటిజన్ ఫైనాన్సియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ 2021లో ప్రారంభించబడిరది. ఇప్పటివరకు 13.36 లక్షలకు పైగా ఫిర్యాదుల ద్వారా రూ.4,386 కోట్లకు పైగా ఆదా చేయబడిరది. ఆన్‌లైన్ సైబర్ ఫిర్యాదులను నమోదు చేయడంలో సహాయం పొందడానికి టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1930 అమలులో ఉంది అని బండి సంజయ్ తెలిపారు.