సైయెంట్ చేతికి ఆస్ట్రేలియా సంస్థ
హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐటీ, ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయెంట్ ఆస్ట్రేలియాకు చెందిన కన్సల్టింగ్ కంపెనీ అయిన ఐజీ పార్టనర్‌ను కొనుగోలు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియాలో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, ప్రాంతీయ రిసోర్ట్ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి సైయెంట్ ఈ కొనుగోలు జరిపింది. ఒప్పందం విలువ మాత్రం ఇరు సంస్థలు వెల్లడించలేదు. పూర్తిగా నగదు రూపంలో జరుగనున్న ఈ ఒప్పందం కంపెనీ ఎంటర్ప్రైజ్ విలువ 11.6 మిలియన్ ఏయూడీగా ఉన్నది. విదేశీ ఇన్వెస్ట్మెంట్ రివ్యూ బోర్డు అనుమతిస్తే ఈ ఒప్పందం వచ్చే ఆరు నెలల్లో పూర్తికాగలదనే విశ్వాసాన్ని సైయెంట్ వ్యక్తం చేసింది.






