స్విగ్గీ ఉద్యోగులకు తీపి కబురు..
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తమ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థకు చెందిన డెలివరీ పార్ట్నర్లు అందరికీ ఉచితంగా కరోనా టీకా అందిస్తామని ప్రకటించింది. స్విగ్గీ సీఓఓ వివేక్ సుందర్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. తమ ఉద్యోగుల కరోనా టీకా ఖర్చులను భరిస్తామని వెల్లడించారు. అలాగే ఆ టీకా స్వీకరణ నిమిత్తం సెలవు తీసుకుంటే ఆ రోజు జీతం కూడా చెల్లిస్తామని తెలిపారు. ఇందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. వీరికి టీకా కోసం తొలి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. టీకాలు తీసుకోవడానికి ముందు తమ డెలివరీ భాగస్వాములకు వర్క్‌షాప్, కౌన్సెలింగ్ సెషన్ల ద్వారా అవగాహన కల్పించనున్నామన్నారు. అలాగే తగిన జాగ్రత్తలను తెలియచెప్పేలా ఒక ఆరోగ్య భాగస్వామితో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. స్విగ్గీ తాజా నిర్ణయంతో సుమారు 2 లక్షల డెలివరీ పార్ట్నర్ లకు ప్రయోజనం కలుగుతుంది.






