ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించండి…

కరోనా మొదటిదశలో ఉన్న పరిస్థితుల కంటే రెండోదశలో ఉన్న పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక ప్యాకెజీని ప్రకటించకపోతే దేశం తీవ్ర ఇబ్బందుల్లోపడటం ఖాయమని అజీమ్ ప్రేమ్‍జీ యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటికే ఈ మహమ్మారిపై భారత్ ఆర్థికంగా స్పందన ఇప్పటివరకు అంతంత మాత్రమేనని, సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రూ.5.5 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ అవసరమవుతుందని నివేదిక తెలిపింది. అజీమ్ ప్రేమ్‍జీ యూనివర్సిటీ నివేదిక ప్రకారం, ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ సంక్షోభ పరిస్థితుల్లో వేగంగా స్పందించి, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అంటూ, ‘స్టేట్ ఆఫ్ వ ర్కింగ్ ఇండియా 2021: వన్ ఇయర్ ఆఫ్ కొవిడ్19’ పేరిట నివేదికను విడుదల చేసింది.