దేశీయ టీవీల విభాగంలోకి కాంపాక్
అమెరికన్ ఎలక్ట్రానిక్ బ్రాండ్ కాంపాక్ దేశీయ స్మార్ట్ టెలివిజన్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. హెఈఎక్స్ క్యూఎల్ఈడీ అల్ట్రా ప్రీమియం స్మార్ట్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. 55 అంగుళాలు, 65 అంగుళాలలో లభ్యమయ్యే ఈ టీవీల ప్రారంభ ధర రూ.59,999. ఎక్స్పీరియన్స్, స్టెబిలైజేషన్ ఇంజిన్ (ఈఎస్ఈ), 4కే యూహెచ్డీ డిస్ప్లే, దోల్బీ ఆడియో, మిమీ హియరింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లున్నాయి. ఇండియాలో ఓసిఫై ఇండస్ట్రీస్‌తో లైసెన్సింగ్ అసోసియేషన్‌ను ప్రారంభించినట్లు కాంపాక్ టెలివిజన్ విభాగం సీఈఓ ఆనంద్ దుబే తెలిపారు.






