హైదరాబాద్ కు కాయిన్బేస్ సంస్థ…
అంతర్జాతీయ వ్యాపార సంస్థలకు నెలవుగా మారిన భాగ్యనగరానికి మరో విశిష్ట సంస్థ రాబోతున్నది. అమెరికాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజీ కాయిన్బేస్ హైదరాబాద్లో కార్యకలాపాలు ప్రారంభించడానికి సన్నద్ధమవుతోంది. భారత్లో మా కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాం. ఐటీ సేవలు, ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలు చేపడతాం. భారత్లో పెద్దఎత్తున లభించే ఇంజనీరింగ్ నిపుణులతో లబ్ధి పొందాలని అనుకుంటున్నాం అని కాయిన్బేస్ వెల్లడించింది. భారత్లో తొలి కార్యాలయాన్ని హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. ఎనిమిదేళ్ల క్రితం ఏర్పాటైన ఈ కంపెనీ బిట్కాయిన్లు, ఎథెరెమ్ వంటి క్రిప్టోకరెన్సీల్లో లావాదేవీలు నిర్వహించడానికి వీలుకల్పిస్తోంది. దీనికి 4.30 కోట్ల మంది వినియోగదార్లు ఉన్నారు. క్రిప్టో కరెన్సీ వ్యాపారాన్ని నియంత్రించడంపై ప్రస్తుతం తీవ్రమైన అనిశ్చితి కొనసాగుతున్నప్పటికీ కాయిన్బేస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.






