కాగ్నిజెంట్ ఉద్యోగులకు శుభవార్త
కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బోనస్‌లు, ప్రమోషన్లతో వారితో ఉత్సాహాన్ని నింపుతోంది. 2019తో పోలిస్తే ఎక్కువగా తాజా బోనస్‌ను ప్రకటించింది. అలాగే 24,000 మందికి పైగా ఉద్యోగులను భారీగా ప్రమోట్ చేయనుంది. సంస్థ అట్రిషన్ (కంపెనీల మార్పు) తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా 24 వేల మంది ప్రమోషన్లతో పాటు ఉద్యోగులకు బోనస్ ఇవ్వన్నుట్లు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ ప్రకటించారు. అలాగే సీనియర్ అసోసియేట్స్, అంతకంటే కింది స్థాయి ఉద్యోగులకు ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. 2021 జూన్ త్రైమాసికరం నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షా అరవై వేల మంది ఉగ్యోగులకు బోనస్‌లను ఇవ్వనున్నామని నంబియార్ తెలిపారు.






