Cognizant: ఈ ఏడాదీ వేతన పెంపు అప్పుడే : కాగ్నిజెంట్

ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) ఉద్యోగులకు బోనస్ చెల్లింపులకు సంబంధించి లెటర్స్ పంపించడం ప్రారంభించింది. 2024 సంవత్సరానికి సంబంధించిన అర్హులైన ఉద్యోగులకు (Employees) 85-115 శాతం మేర బోనస్ చెల్లించనుంది. మెజారిటీ సంఖ్యలో ఉద్యోగులు బోనస్ కు అర్హత సాధించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఉద్యోగులకు బోనస్ లెటర్లు(Bonus letters) మెయిల్ ద్వారా అందనున్నాయి.
బోనస్ చెల్లింపులు అందుకున్న ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలల్లో చెల్లింపులు జరుగుతాయి. వ్యక్తిగత పే రోల్ షెడ్యూల్ ప్రకారం ఈ చెల్లింపులు ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. గడిచిన మూడేళ్లతో పోలిస్తే ఈసారి బోనస్ మొత్తం అధికమని పేర్కొన్నాయి. అలాగే, పనితీరు ఆధారంగా చెల్లించే వేతన పెంపు ఈ ఏడాది ఆగస్టు (August) లో చేపట్టనుంది. గతేడాది కూడా ఇదే సమయంలో వేతన పెంపు చేపట్టింది. అంతకుమందు ఏప్రిల్ (April) లోనే వేతన పెంపు చేపట్టినప్పటికీ గతేడాది నుంచి ఆగస్టుకు మార్చింది.