India : భారత్‌పై చిప్ దిగ్గజాల దృష్టి!

చిప్ తయారీలో దిగ్గజాలుగా ఉన్న సంస్థలు భారత్ (India) పై దృష్టి సారించాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్(Electronics), ( Mobiles) , వాహన తయారీ మరింత పెంచేందుకు బహుళజాతి-దేశీయ సంస్థలు సన్నాహాలు చేస్తున్న తరుణంలో చిప్ (Chip) లకు అమిత గిరాకీ ఏర్పడుతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా చిప్ తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే జర్మనీ (Germany) కి చెందిన సెమీకండక్టర్ సంస్థ ఇన్ఫినియోన్, అమెరికా (America)కు చెందిన చిప్ సరఫరా సంస్థ ఆన్‌సెమీ, భారత కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుని, ఇక్కడ సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్టింగ్ (ఓఎస్‌ఏటీ) సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.