Tesla : టెస్లాను దాటేసిన బీవైడీ!

చైనా కార్ల తయారీ సంస్థ బీవైడీ నుంచి అమెరికా (America) కు చెందిన టెస్లా (Tesla) కు తీవ్రమైన పోటీ వస్తోంది. తాజాగా వార్షిక ఆదాయాల్లో మస్క్ నేతృత్వంలోని సంస్థను మించింది. షెంజెన్(Shenzhen) కేంద్రంగా పనిచేసే బీవైడీ (BYD) గతేడాది 107 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించినట్లు పేర్కొంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 29 శాతం అధికం. ఇక ఇదేకాలంలో టెస్లాకు వచ్చిన ఆదాయం 97.9 బిలియన్ డాలర్లే కావడం గమనార్హం. బీవైడీ విక్రయాల్లో హైబ్రీడ్ వాహనాల జోరు కొనసాగుతోంది. బీవైడీ గతేడాది టెస్లా విక్రయించిన విద్యుత్తు వాహనాల సంఖ్యకు (17.9 లక్షల) దాదాపు సమానంగా 17.6 లక్షల వాహనాలను అమ్మింది. కానీ, దీనిలో హైబ్రీడ్ వాహనాల విభాగంలో మాత్రం భారీ పెరుగుదలను నమోదు చేసింది. ఈసారి ఆ కంపెనీ ఏకంగా 43 లక్షల వాహనాలను ప్రపంచవ్యాప్తంగా విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. క్విన్ ఎల్ (Quinn L) గా పిలిచే ఈ కారు ధర టెస్లా మోడల్ 3లో దాదాపు సగమే ఉంది.