59 ఏళ్ల తర్వాత మళ్లీ… తెలుగు వ్యక్తికి

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తదుపరి చైర్మన్ కానున్నారు. ఆయన నియామకానికి సంబంధించి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్‌టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్‌ఎస్‌బీఐ) సిఫార్సు చేయడం విశేషం. ప్రధామంత్రి నేతృత్వంలోని నియామకాల కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఎస్‌బీఐగా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం చైర్మన్ దినేష్ ఖారా పదవీకాలం ఆగస్టు 28న ముగియనుంది. అదే రోజు శ్రీనివాసులు శెట్టి బాధ్యతలు స్వీకరించే అకాశముంది. 1962-65లో తెలుగు వ్యక్తి బొర్రా వెంకటప్పయ్య ఎస్‌బీఐ చైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత 59 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంరం మరో తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు ఎస్‌బీఐ చైర్మన్‌గా నియమితులయ్యారు.