Starlink : కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేస్తేనే… స్టార్‌లింక్ సేవలకు అనుమతి!

భారత్‌లో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా అమెరికాకు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సేవల సంస్థ స్టార్‌లింక్ (Starlink) ను కేంద్ర ప్రభుత్వం అడిగినట్లు తెలుస్తోంది. సున్నిత ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనికేషన్ సేవల రద్దు లేదా తాత్కాలికంగా నిలిపేందుకు, చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా చూసేందుకు ఈ కంట్రోల్ సెంటర్ (Control Center ) ఉపయోగడుతుందన్నది ప్రభుత్వ ఉద్దేశంగా తెలిసింది. మనదేశంలో స్టార్‌లింక్ శాటిలైట్ సేవలు అందించేందుకు ఆ సంస్థతో ఎయిల్‌టెల్ (, Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) ఒప్పందం చేసుకున్న సంగతి విదితమే. టెలికాం చట్ట నిబంధనల ప్రకారం ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లడం లాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఒక అధీకృత సంస్థ నుంచి టెలికాం సేవలు లేదా నెట్ వర్క్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా తమ అధీనంలోకి తీసుకోవచ్చు. ఇలా అత్యవసర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఒక అధీకృత సంస్థ నుంచి టెలికాం సేవలు లేదా నెట్ వర్క్‌ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తాత్కాలికంగా తమ అధీనంలోకి తీసుకొచ్చు. ఇలా అత్యవసర పరిస్థితి తలెత్తిన ప్రతిసారీ అమెరికాలోని స్టార్‌లింక్ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదాంచాల్సిన పరిస్థితి ఉండకూడదంటే, భారత్ (India)లో ఒక కంట్రోల్ సెంట్రర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.