విదేశల్లో ఉన్నవారి నుంచి.. ఇకపై రూ.10 లక్షల వరకు
కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ)లో మార్పులు చేసింది. తద్వారా, విదేశాల్లో ఉన్నవారి నుంచి భారత్లో ఉన్నవారు ఏడాదికి రూ.10 లక్షల వరకు నగదు అందుకోవచ్చు. అందుకుగాను కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సమాచారమూ, వివరాలూ సమర్పించనక్కర్లేదు. గతంలో ఈ పరిమితి రూ.1 లక్షగా ఉండేది. ఇప్పుడు దానిని రూ.10 లక్షలకు పెంచారు. అంతే కాదు ఒకవేళ నగదు పరిమితి దాటితే ప్రభుత్వానికి సమాచారం అందజేయవలసిన గడువును కూడా 30 రోజుల నుంచి 90 రోజులకు పెంచింది. ఈ మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎఫ్సీఆర్ఏలోని రూల్ 6లో మార్పులకు ఆమోదం తెలుపుతున్నట్లు ఆ నోటిపికేషన్లో పేర్కొంది.






