ఓ అజ్ఞాతవ్యక్తికి అదృష్టం.. లాటరీలో
అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ అజ్ఞాత వ్యక్తికి అదృష్టం లక్కలా పట్టింది. ఆయన కొన్న పవర్‌బాల్ టికెట్ (లాటరీ)కు కనీవినీ ఎరగని రీతిలో సుమారు రూ.16,500 కోట్ల (2.04 బిలియన్ డాలర్లు) జాక్‌పాట్ తగిలింది. తల్లాహాస్సీలోని ఫ్లోరిడా లాటరీ డ్రా స్టూడియోలో తీసిన డ్రాలో 10, 33, 41, 47, 56 నంబర్ల టికెట్లకు లాటరీ తగిలింది. వీటిలో 10 నంబరు రెడ్ పవర్‌బాల్ 10గా నిలిచింది. అల్టాడెనాలోని జోస్ సర్వీస్ సెంటర్లో విక్రయించిన టికెట్‌కు ఆ నంబరు తగిలింది. దీంతో ఈ టికెట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తికి జాక్‌పాట్ సొంతమైంది. అయితే ఇప్పటి వరకూ ఆ వ్యక్తి ఎవరనేది తెలియలేదు.






