వేలంలో 22 కోట్లు పలికిన జాకెట్
1969లో నీల్ఆర్మ్స్ట్రాంగ్తో కలిసి చంద్రుడిపై అడుగుపెట్టిన సమయంలో వ్యోమగామి బజ్ ఆల్డ్రిన్ వేసుకున్నస్పేస్ జాకెట్ జరిగిన వేలంలో రికార్డు ధర పలికింది. న్యూయార్క్లో జరిగిన వేలంలో ఈ జాకెట్ 28 లక్షల డాలర్ల (దాదాపు రూ.22.3 కోట్లు)కు అమ్ముడుపోయింది. వేలం నిర్వహణ సంస్థ సోత్బే పేర్కొన్నది. ఈ స్పేస్ ఫ్లైట్ జాకెట్ ముందు భాగంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా లోగోతో పాటు అపోలో`11 మిషన్ చిహ్నం, దానికి కొద్దిగా పైన ఆల్డ్రిన్ నేమ్ ట్యాగ్ ఉన్నాయి. దాని ఎడమ భుజంపై అమెరికా జెండా కూడా ఉన్నది. ప్రస్తుతం బజ్ ఆల్డ్రిన్ వయసు 92 ఏండ్లు. 1969లో చేపట్టిన చరిత్రాత్మక మిషన్ అపోలో `11 ద్వారా చంద్రుడిపైకి వెళ్లిన ముగ్గురిలో ప్రస్తుతం జీవించి ఉన్నది ఈయన ఒక్కరే.






