2021-22 బడ్జెట్ లోని ముఖ్యాంశాలు..
కరోనా మహమ్మారితో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది. జనజీవితం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే నూతన ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. డిజిటల్ పద్ధతిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాలపాటు ప్రసంగించారు. బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్షల కోట్లుగా ఆమె పేర్కొన్నారు. 2021-22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతంగా ఉండనుందనే అంచనాలను వెల్లడించారు. 2025-26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022లో రూ.12 లక్షల కోట్ల అప్పులు తేవాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఆదాయ పన్నులపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021-22 బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.






