Boeing : ఉద్యోగులకు షాక్ ఇచ్చిన బోయింగ్

బెంగళూరు (Bangalore)లోని ఇంజినీరింగ్ టెక్నాలజీ కేంద్రంలో పనిచేస్తున్న 180 మంది వరకు ఉద్యోగుల (Employees)ను బోయింగ్ (Boeing) తొలగించింది. అంతర్జాతీయంగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ లో ఇది భాగమని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్ (India)లో బోయింగ్‌కు 7000 మంది సిబ్బంది ఉన్నారు. అంతర్జాతీయంగా తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న సంస్థ, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు గతేడాది ప్రకటించింది. తాజా ఉద్యోగుల తొలగింపుపై బోయింగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.