బయోలాజికల్-ఇ మరో ఘనత

హైదరాబాద్‌కు చెందిన వ్యాక్సిన్ తయారీ సంస్థ బయోలాజికల్-ఇ మరో ఘనత సాధించింది. న్యూమోనియాను, బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చేసిన 14-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ-14) సురక్షితమని నిర్ధారణ అయింది. ఈ వ్యాక్సిన్‌ను 6 నుంచి 8 వారాల శిశువులకు ఇచ్చినట్లైతే న్యూమోనియాను అరికట్టేందుకు అవకాశం ఉంటుంది. భారత్‌తో పాటు ఇతర దేశాల్లో ఐదేండ్ల లోపు వయసున్న ఎంతో మంది పిల్లల మరణాలకు కారణమవుతున్న న్యుమోనియాను నిరోధించేందుకు పీసీవీ-14 వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది. 14 రకాల స్ట్రెప్టోకోకస్ వైరస్ వేరియంట్లను ఎదుర్కోగలదు. భారత్‌లో అధికంగా వ్యాప్తి చెందుతున్న 22 ఎఫ్, 33 ఎఫ్ రకం స్ట్రెప్టోకోకస్ వైరస్ నుంచి సమర్థవంతంగా రక్షణ కల్పిస్తుంది.