బయోలాజికల్ -ఈ చేతికి అకోర్న్ ఇండియా
అమెరికాకు చెందిన అకోర్న్ ఐఎన్సీ కంపెనీ అనుబంధ సంస్థ అకోర్న్ ఇండియాను హైదరాబాద్కు చెందిన బయోలాజికల్-ఈ (బీఈ) సొంతం చేసుకుంది. కొనుగోలు విలువను మాత్రం వెల్లడించలేదు. హిమచల్ప్రదేశ్లో అకోర్న్కు స్టెరైల్ ఇంజెక్టబుల్స్ను తయారు చేసే యూనిట్ ఉంది. ఈ ప్లాంట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 13.5 కోట్ల ఇంజెక్షన్లుగా ఉంది. దీన్ని మరో 3 కోట్లకు పెంచుకోవచ్చు. ఈ వ్యూహాత్మక కొనుగోలు ద్వారా స్పెషాలిటీ జనరిక్ ఇంజెక్షన్లు, వ్యాక్సిన్లను తయారు చేసే సామర్థ్యం సమకూరుతుందని బయోలాజికల్-ఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల తెలిపారు. కొవిడ్ 19 చికిత్సకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ను భారీగా ఉత్పత్తి చేయడానికి అకోర్న్ ఇండియా ప్లాంట్ను వినియోగించుకోగలమని చెప్పారు.






