పాకిస్థాన్‌కు అమెరికా యుద్ధ విమానాలు
పాకిస్థాన్‌కు ఎఫ్-16 యుద్ధ విమాన పరికరాలను అమ్యేందుకు జో బైడెన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు 450 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఎఫ్-16 విమాన పరికరాలను అమ్మేందుకు అమెరికా సిద్ధమైంది. భవిష్యత్తులో పాక్‌ను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా చెబుతోంది. రిలీజ్ చేసిన నోటిఫికేన్లో అమెరికా కాంగ్రెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఎఫ్-16లతో పాటు సంబంధిత ఎక్విప్మెంట్ను సుమారు 450 మిలియన్ల డాలర్లకు ఆమ్మేందుకు ఆమోదం తెలిపినట్లు యూఎస్ కాంగ్రెస్ పేర్కొన్నది. ఈ అమ్మకానికి సంబంధించిన డిఫెన్స్ సెక్యూర్టీ కొ ఆపరేషన్ ఏజెన్సీ ధ్రువీకరణ ప్రకటన చేసింది. నాలుగేళ్లలో మొదటిసారి ఈ తరహా సహాయానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆమోదం తెలిపారు. ఇదిలా ఉంటే 2018లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్‌కు రెండు బిలయన్ల డాలర్ల సహాయాన్ని నిలిపివేశారు.






