టైమ్స్ జాబితాలో భీమ్ ఆర్మీ చీఫ్
టైమ్ మ్యాగ్జిన్ ప్రతి ఏడాది ప్రకటించే వంద మంది ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌తో పాటు మరో అయిదు మంది భారత సంతతి వ్యక్తులు చోటు సంపాదించారు. ట్విట్టర్ సంస్థకు చెందిన టాప్ లాయర్ విజయ గద్దెతో పాటు యూకే ఆర్థిక మంత్రి రిషి సునాక్ కూడా ఆ లిస్టులో ఉన్నారు. 2021 టైమ్ 100 నెక్టస్ జాబితాను రిలీజ్ చేశారు. లిస్టులో ఉన్నవారంత చరిత్ర సృష్టించేవారని, నిజానికి వారంతా ఇప్పటికే చరిత్ర సృష్టించినట్లు టైమ్ 100 ఎడిటోరియల్ డైరక్టర్ డాన్ మాక్సాయి తెలిపారు. టైమ్ ఎమర్జింగ్ లీడర్స్ జాబితాలో ఉన్నవారిలో ఇన్‌స్టాకార్ట్ ఫౌండర్, సీఈవో అపూర్వ మెహతా ఉన్నారు. గెట్ అస్ పీపీఈ సంస్థ డైరెక్టర్ శిఖా గుప్తా, అప్‌సాల్వ్ ఫౌండర్ రోహన్ పావులూరి ఆ జాబితాలో ఉన్నారు.






