బిలియనీర్ ల జాబితాలో న్యూయార్క్ కు షాక్… తొలి స్థానంలో
ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న నగరాల జాబితాను ఫోర్బస్ విడుదల చేసింది. ఇందులో న్యూయార్క్ సిటీని వెనక్కి చైనా రాజధాని బీజింగ్ తొలి స్థానంలో నిలవడం విశేషం. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా అల్లకల్లోలం కాగా.. చైనాలో మాత్రం బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఏడాది కాలంలో న్యూయార్క్ సిటీలో కొత్తగా కేవలం 7 మంది బిలియనీర్లు చేరగా బీజింగ్‌లో మాత్రం వీళ్ల సంఖ్య 33గా ఉంది. ఇన్నాళ్లూ నాలుగో స్థానంలో ఉన్న బీజింగ్ ఏకంగా తొలి స్థానానికి దూసుకెళ్లింది.
డాలర్ బిలియనీర్ల విషయానికి వస్తే ప్రస్తుతం ఇలాంటి వాళ్లు బీజింగ్‌లో 100 మంది ఉన్నారు. న్యూయార్క్ సిటీలో వీళ్ల సంఖ్య 99. అయితే ఈ బిలియనీర్ల మొత్తం సంపద పరంగా చూస్తే ఇప్పటికే న్యూయార్క్ టాప్‌లో ఉంది. బీజింగ్ కుబేరుల మొత్తం సంపద 48400 కోట్ల డాలర్లుగా కాగా, న్యూయార్క్ కుబేరుల సంపద 56000 కోట్ల డాలర్లుగా ఉంది. వీళ్లలో న్యూయార్క్ సిటీలో ఉండే మైకేల్ బ్లూమ్‌బర్గ్ అత్యంత సంపన్నుడు. టాప్ టెన్ నగరాల జాబితాలో ఇండియా నుంచి ముంబై కూడా చోటు దక్కించుకోవడం విశేషం.






