ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా సావిత్రి జిందాల్
ఆసియాలోనే అత్యంత సంపన్న మహిళగా జిందాల్ గ్రూప్ చైర్పర్సన్ సావిత్రి జిందాల్ నిలిచారు. ఇప్పటిదాక ఆసియా సంపన్న మహిళగా ఉన్న యాంగ్ హుయాన్ను స్తానంలో సావిత్రి ముందుకు దూసుకొచ్చారు. చైనాలో రియల్ ఎస్టేట్ సెక్టార్ తీవ్ర సంక్షోభంలో పడిపోవడంతో చైనీస్ రియల్ ఎస్టేట్ దిగ్గజం కంట్రీ గార్డెన్ మేజర్ వాటాదారురాలైన యాంగ్ సంపద ఈ ఏడాది సగం సంపదహారతి కర్పూరంలా కరిగిపోవడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే యాదృచ్చికంగా 2005 లోనే (తండ్రి నుంచి యాంగ్, భర్త అకాల మరంణంతో సావిత్రి జిందాల్) ఇద్దరూ వ్యాపార బాధ్యతలను చేపట్టడం విశేషం. 11.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో 72 ఏళ్ల జిందాల్ భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళ రికార్డు దక్కించుకున్నారు. 18 బిలియన్ల డలర్ల నికర విలువతో 2021లో ఫోర్బ్స్ అత్యంత సంపన్న భారతీయుల జాబితాలో చోటు సంపాదించారు సావిత్రి జిందాల్. అంతేకాదు దాదాపు 1.4 బిలియన్ డాలర్లతో దేశంలో టాప్ 10లో ఉన్న ఏకైక మహిళ కూడా.






