6 సిరీస్ స్మార్ట్ వాచ్ ను ఆవిష్కరించిన యాపిల్
అమెరికా టెక్నాలజీ దిగ్గజం యాపిల్.. తన స్మార్ట్ వాచ్ లో 6 సిరీస్‌ను ఆవిష్కరించింది. రక్తంలో ప్రాణవాయువు (ఆక్సిజన్) స్థాయి ఎంతో చెప్పగలగడం ఈ వాచ్ ప్రత్యేకతని యాపిల్ వెల్లడించింది. సాధారణంగా ఇందుకు పల్స్ ఆక్సిమీటర్ అవసరం అవుతుంది. కరోనా వ్యాప్తి కాలంలో ప్రజలకు రక్తంలో ఆక్సిజన్ స్థాయి తగ్గకుండా చూసుకోవడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ఆక్సిమీటర్ అవసరం లేకుండానే రక్తంలో ఆక్సిజన్ స్థాయిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునేందుకు వీలుగా యాపిల్ కొత్త స్మార్ట్ వాచ్ ను అందుబాటులోకి తేవడం గమనార్హం. ఏడు రంగుల్లో లభించే ఈ వాచ్ ప్రారంభ ధర రూ.399 డాలర్లు. 6 సిరిస్ వాచ్‌తో పాటు యాపిల్ వాచ్ ఎక్ఈని సైతం విడుదల చేసింది. ఫ్యామిలీ సెటప్, ఫాల్ డిటెక్షన్ వంటి ఫీచర్లతో కూడిన దీని ధర రూ.279 డాలర్లు.






