యాపిల్ గుడ్ న్యూస్… ఇండియాలో నాలుగురెట్లు
ఐఫోన్ తయారీదారు యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు అన్ని టెక్ దిగ్గజాలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ఇండియాలోని ఫ్యాక్టరీలో వర్క్‌ఫోర్స్‌ను నాలుగు రేట్లు పెంచాలని యోచిస్తోంది. ట్విటర్, మెటా, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు వేలమందిని ఉద్యోగులను తొలగించాయి. తాజాగా అమెజాన్ అదే బాటలో ఉన్న నేపథ్యంలో యాపిల్ నిర్ణయం విశేషంగా నిలిచింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ అయిన జెంగ్జౌ ప్లాంట్ వద్ద కఠిన ఆంక్షలు కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిరది. ఫలితంగా ప్రీమియం ఐఫోన్ 14 మోడళ్ల షిప్‌మెంట్‌ను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ డిమాండ్ నెరవేర్చే యోచనలో యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ ఇండియాలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగులను పెంచుకోనుంది. రానున్న రెండేళ్లలో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచాలని భావిస్తోంది.






