ఐఫోన్ యూజర్లకు హెచ్చరిక : యాపిల్

భారత్‌తో పాటు 98 దేశాల ఐఫోన్ యూజర్లకు యాపిల్ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. కిరాయి స్పైవేర్ దాడులు జరుగుతున్నాయని అప్రమత్తం చేసింది. ఐఫోన్లలో స్పైవేర్ చొరబడ్డ యూజర్లను గుర్తించి, వారికి వ్యక్తిగతంగా సందేశాలు పంపుతోంది. మీరు ప్రముఖులు కావడం వల్ల మీ ఐఫోన్‌పై కిరాయి స్పైవేర్ చొరబడింది. మీరు మీ డివైజ్ రక్షణకు జాగ్రత్తలు తీసుకోండి అని సూచించింది.