ఆపిల్ కు షాక్.. ఓ స్టూడెంట్ కు 36 కోట్లు

ఆపిల్ సంస్థ ఇప్పుడు భారీ మూల్యం చెల్లిస్తోంది. ఓ స్టూడెంట్‍కు ఏకంగా రూ.36 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. తమ దగ్గరికి రిపేర్ కోసం వచ్చిన ఐఫోన్‍లో ఉన్న నగ్న ఫొటోలు, సెక్స్ వీడియోలను సోషల్ మీడియాలో ఆ సంస్థకు చెందిన వ్యక్తులు అప్‍లోడ్ చేశారు. ఆ ఫొటోలు, వీడియోలు ఆ ఫోన్ రిపేర్ కోసం ఇచ్చిన అమ్మాయివే. అదే కాకుండా వాటిని ఆమె సోషల్ మీడియా అకౌంట్‍లోనే పోస్ట్ చేశారు. అప్పుడే ఆపిల్ సంస్థపై సదరు అమ్మాయి పరువు నష్టం దావా వేసింది.
2016లో కాలిఫోర్నియాలోని ఒరెగాన్‍కు చెందిన ఓ విశ్వవిద్యాలయ విద్యార్థిని తన ఫోన్ రిపేర్‍కు రావడంతో సమీపంలోని పెగాట్రాన్ సంస్థ నిర్వహిస్తున్న సర్వీస్ సెంటర్ వెళ్లింది. తన ఫోన్ బాగు చేయమని సర్వీస్ సెంటర్‍లో ఫోన్ ఇచ్చి వచ్చింది. ఫోన్ రిపేర్ చేసిన తర్వాత అందులో ఆమెకు సంబంధించిన 10 ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేశారు. వాటిని చూసిన ఆమె ఫ్రెండ్స్ విషయం చెప్పడంతో వెంటనే డిలీట్ చేసింది. అయితే ఇది తీవ్రమైన ప్రైవసీ
ఉల్లంఘన కిందికి రావడంతో సంస్థపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయిచింది. ఆమెకు నష్ట పరిహారంగా 50 లక్షల డాలర్లు (సుమారు రూ.36 కోట్లు) చెల్లించాలని ఆమె తరపు లాయర్లు డిమాండ్ చేశారు. దీంతో ఇప్పుడు ఆపిల్ సంస్థ దిగి వచ్చిన ఆ మొత్తం చెల్లించడానికి సిద్ధపడింది. ఈ విషయాలు రహాస్యంగా ఉంచారు కానీ టెలిగ్రాఫ్ బహిర్గతం చేసింది.