రికార్డు సృష్టించిన యాపిల్
యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాప్ బుధవారం 2 లక్షల కోట్ల డాలర్లకు (రూ.150 లక్ష కోట్లు) చేరింది. ఈ ఘనత సాధించిన తొలి అమెరికా కంపెనీ ఇదే. ప్రపంచంలో 2 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన రెండో కంపెనీ ఇది. గత ఏడాది డిసెంబర్లో సౌదీ ఆరామ్కో ఈ రికార్డ్ సాధించింది. అయితే చమురు ధరల పతనం కారణంగా ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం 1.82 లక్షల కోడ్ల డాలర్లుగానే ఉంది. లాక్డౌన్ కారణంగా చైనాలో ఐఫోన్ తయారీ తగ్గింది. అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయాయి. అయితే ఆన్లైన్ అమ్మకాలు జోరుగా ఉండటంతో యాపిల్‌కు క్రేజ్ తగ్గలేదని నిపుణులంటున్నారు. కాగా, యాపిల్ తాజా మార్కెట్ క్యాప్ బీఎస్ఈ మొత్తం మార్కెట్ క్యాప్‌కు సమానం. రూ.13.8 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ మన దగ్గర అత్యధిక మార్కెట్ క్యాంప్ కంపెనీగా నిలిచింది.






