Apple: హైదరాబాద్ నుంచి యాపిల్ ఎయిర్‌పాడ్స్

అమెరికా సంస్థ యాపిల్ (Apple) , హైదరాబాద్‌లోని ఫాక్స్‌కాన్ ప్లాంటులో ఎయిర్‌పాడ్స్ (AirPods) తయారు చేయించి, ఎగుమతి చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏప్రిల్‌లో వీటి ఎగుమతులు ప్రారంభించాలన్నదే కంపెనీ ప్రణాళికగా విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఐఫోన్ల (iPhones) తరువాత, యాపిల్ భారత్ (India) లో తయారు చేయిస్తున్న రెండో ఉత్పత్తి ఎయిర్‌పాడ్స్ మాత్రమే. హైదరాబాద్ (Hyderabad) ప్లాంటులో తయారు చేసేవాటిని తొలుత ఎగుమతుల కోసమే కేటాయించనున్నారు. 2023 ఆగస్టులో ప్లాంటు ఏర్పాటు కోసం ఫాక్స్‌కాన్ సంస్థ 400 మిలియన్ డాలర్లు ( సుమారు రూ.3,500 కోట్లు ) కేటాయించిన సంగతి విదితమే.