స్కెచర్స్ ఇండియాకు అనన్య పాండే ప్రచారం
కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న స్పోర్టస్ అండ్ లైఫ్ స్టైల్ బ్రాండ్ అయిన స్కెచర్స్, జీవనశైలి మరియు ఫ్యాషన్ సేకరణలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్కెచర్స్ ఇండియాకు మొదటి మహిళ బ్రాండ్ అంబాసిడర్గా బాలీవుడ్ సంచలనం అనన్య పాండేను ఎంపిక చేసుకుంది. అనన్య పాండే నటించిన ఒరిజినల్స్ కీప్ మూవింగ్ ప్రచారాన్ని తాజాగా ప్రారంభించింది. ఈనాటి యువత ఎలాంటి సమయంలోనూ నిరాశకు గురికాకుండా, ముందుకు వెళ్లడాన్ని ప్రేరేపించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని సంస్థ సీఓఓ డేవిడ్ వీన్బెర్గ్ వ్యాఖ్యానించారు. అనన్యతో కొత్త భాగస్వామ్యం కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇండియాలో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు.






