ఢిల్లీ-న్యూయార్క్ విమానం.. లండన్‌లో అత్యవసర ల్యాండింగ్!

ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్తోన్న విమానంలోని ఓ ప్రయాణికుడికి అత్యవసర వైద్య సహాయం అవసరమైంది. దీంతో అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని లండన్‌కు దారి మళ్లించినట్లు విమానయాన సంస్థ వర్గాలు వెల్లడించాయి. లండన్ కాలమాన ప్రకారం ఉదయం 7గంటలకు ఆ విమానాన్ని దారి మళ్లించినట్లు సమాచారం. అయితే, ఆ సమయంలో విమానంలో ఎంతమంది ఉన్నారు? ప్రయాణికుడి పరిస్థితికి సంబంధించి ఎటువంటి వివరాలు వెల్లడికాలేదు.