ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా… ఎల్‍విఎంహెచ్ అధినేత

ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ లగ్జరీ వస్తువుల సంస్థ ఎల్‍విఎంహెచ్ యజమాని బెర్నార్డ్ ఆర్నాల్ట్ జెఫ్ బెజోస్‍ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు రికార్డు సృష్టించారు. ఎల్‍విఎంహెచ్ స్టాక్ విలువ గణనీయంగా పెరగడంతో ఆర్నాల్ట్ నికర పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‍లైన్ రిటైల్ ప్లాట్‍ఫామ్ అయిన అమెజాన్ సిఇఒ జెఫ్ బెజోస్‍ను ఆయన వెనక్కి నెట్టారు. ఫోర్బస్ ప్రకారం, బెర్నార్డ్ ఆర్నాల్ట్ నికర విలువ 186.2 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.13.28 లక్షలు. ఆర్నాల్ట్ తన కుటుంబానికి చెందిన ఫ్రెంచ్ బ్రాండ్ కంపెనీ స్టాక్‍ను గత నెలలో 538 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది ఆయన్ని ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా మార్చింది. జెఫ్ బెజోస్ సంపద ఈ సంవత్సరం 2 శాతానికి కంటే ఎక్కువ తగ్గింది.
ప్రపంచంలో మూడో ధనవంతుడైన టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ సంపద 8.09 బిలియన్ డాలర్లు పడిపోయింది. 2021 మే 22న మస్క్ మొత్తం ఆస్తులు 162 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఆస్తులు ఈ సంవత్సరం 7.50 శాతం లాభపడ్డాయి. ఫేస్‍బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‍బర్గ్ సంపద దాదాపు 14 శాతం పెరిగింది. అదే సమయంలో ప్రపంచంలో అతిపెద్ద పెట్టుబడిదారు అయిన వారెన్ బఫెట్ ఆస్తులలో 24 శాతం పెరుగుదల ఉంది.