ఏఐకి పోటీ ఇచ్చేందుకు అమెజాన్ కసరత్తు

ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీకి పోటీ ఇచ్చేందుకు టెక్ దిగ్గజం అమెజాన్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం నూతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్‌ను లాంఛ్ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మెటిస్ పేరుతో అమెజాన్ న్యూ ఏఐ చాట్‌బాట్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. భవిష్యత్‌లో అమెజాన్ అంతర్గత ఏఐ మోడల్ ఒలింపస్ ఆధారంగా మెటిస్ పనిచేస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుత మోడల్ టైటాన్ ఏఐ మోడల్ కంటే ఒలింపస్ అత్యంత శక్తివంతమైన ఏఐ మోడల్ కావడం గమనార్హం. సంభాషణల పద్ధతిలో టెక్ట్స్, ఇమేజ్ ఆధారిత సమాధానాలను ఇచ్చేలా మెటిస్‌ను డిజైన్ చేస్తున్నారు. సోర్స్ రెస్పాన్స్‌లకు లింక్‌లు షేర్ చేయడం, ప్రశ్నలను ఫాలోఆప్ చేయడం, ఇమేజ్ జనరేట్ చేయడం వంటి విధులనూ మెటిస్ నిర్వర్తిస్తుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ సహా పలు టెక్ కంపెనీల న్యూ ఏఐ అసిస్టెంట్‌లకు దీటుగా మెటిస్‌ను ముందుకు తీసుకొచ్చేందుకు అమెజాన్ కసరత్తు సాగిస్తోంది.