శుభవార్త చెప్పిన అమెజాన్
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా పండగ వేళ దేశంలో మరింత విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఇందుకుగాను వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు లక్షమంది సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకున్నట్లు ప్రకటించింది. కాగా వినియోగదారుల డిమాండ్ మేరకు డెలీవరీ సిబ్బందిని నియమించుకున్నామని అమెజాన్ తెలిపింది. మరోవైపు ప్రత్యక్ష నియమమకాలు మాత్రమే కాకుండా పరోక్షంగా ప్యాకేజింగ్ విభాగాలలో కూడా అనేక మందికి ఉపాధి లభించినట్లు పేర్కొంది.
అయితే దేశంలో టెక్నాలజీ, మౌలిక సౌకర్యాలు, లాజిస్టిక్స్ తదితర రంగాలలో పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. దేశ కీలక రంగాలలో అనేక పెట్టుబడులు పెట్టనున్నామని, భారీ పెట్టుబడుల నేపథ్యంలో 2015 సంవత్సరం వరకు 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు పేర్కొంది. అయితే మరో నివేదిక రెడ్‌సీర్ ప్రకారం పండుగ సీజన్లో కొనుగోళ్లు భారీ స్థాయిలో పెరుగుతాయని, ఎలక్ట్రానిక్స్, ఫ్యాష్, గృహ రుణాలు పండగ సీజన్లో భారీ డిమాండ్‌కు అవకాశం ఉందని అభిప్రాయపడింది.






