జులిలీ కీలక నిర్ణయం.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి
అమెజాన్‌కు పోటీగా నిలిచిన జులిలీ ప్రస్తుతం కష్టాల్లో ఉంది. అమెరికాలో కార్యకలాపాలను మూసేస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో వందలాది సంఖ్యలో ఉద్యోగులు తొలగిస్తోంది. సీటెల్, వాషింగ్టన్ ప్రాంతాల్లోని 292 మంది కార్మికులను తొలగిస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుండి అమలులోకి వస్తుందని సీటెల్ రాష్ట్ర ఉపాధి భద్రతా విభాగం ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. 13 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కంపెనీ తన పయనీర్ స్క్వేర్ ప్రధాన కార్యలయాన్ని, ఇతర రాష్ట్రాల్లోని అనేక యూనిట్లను మూసివేస్తోంది. సెవాడా, ఒహియో లోని గిడ్డంగులను మూసివేయడం వల్ల మరో 547 మందిపై వేటు పడుతుందని సమాచారం. అక్టోబర్‌లో దాని సీఈవో టెర్రీ బాయిల్ రాజీనామా తర్వాత నుంచి ఈ తొలగింపుల పరంపర కొనసాగుతోంది.






