విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్.. రూ.999 కే టికెట్
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రాంతీయ అనుబంధ సంస్థ, అలయన్స్ ఎయిర్ విమాన ప్రయాణీకులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ వేసవిలో అలయన్స్ ఎయిర్ పాకెట్ ఫ్రెండ్లీ ఛార్జీలను అందిస్తోంది.. తగ్గింపు రేట్లలో 60 వేల విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. 999 రూపాయల నుంచి టికెట్ ధరలు ప్రారంభం. ఈ రోజు (మార్చి 13) నుండి ప్రారంభమై మార్చి 15 వరకు అందుబాటులో ఉంటుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్ ద్వారా ప్రయాణీకులు ఏప్రిల్ 1 నుంచి 2021 సెప్టెంబర్ 30 మధ్య ప్రయాణించవచ్చు.
సీట్లున్నంతవరకు టికెట్లు ముందుగా ఎవరు బుక్ చేసుకుంటారో వారికే ఈ ఆఫర్ వర్తించనుంది. ఢిల్లీ-జైపూర్/ ప్రయోగ్రాజ్, హైదరాబాద్-బెలగాం, అహ్మదాబాద్-కాండ్లా, బెంగళూరు-కొచ్చి/ కాజీకోడ్ వంటి పలు నగరాలకు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు బయలుదేరడానికి ఒక వారం ముందు తేదిని ఉచితంగా మర్చకోడానికి కూడా అవకాశం ఉందని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.






