హిట్లర్ చేతి గడియారం… వేలంలో భారీ ధర
జర్మనీ దివంగత నియంత అడాల్ఫ్ హిట్లర్‌కు చెందిన చేతి గడియారానికి వేలంలో భారీ ధర పలికింది. అమెరికా మేరీలాండ్‌లోని చెసపీక్ సిటీకి చెందిన అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్థ ఈ వేలాన్ని నిర్వహించింది. ఓ అజ్ఞాత వ్యక్తి 1.1 మిలియన్ డాలర్లకు (సుమారు రూ.8.71 కోట్లు) గడియారాన్ని సొంతం చేసుకున్నట్లు ఆ సంస్థ వెల్లడిరచింది. వాచీ వెనుక వైపు స్వస్తిక్ చిహ్నంతో పాటు ఏ హెచ్ ఆంగ్ల అక్షరాలు పొందుపర్చి ఉన్నాయి. వేలంలో సంస్థ వివరాల ప్రకారం 1945లో ఫ్రెంచ్ సైన్యం హిట్లర్ తలదాచుకున్న స్థావరంపై దాడి చేసినప్పుడు ఓ సైనికుడు ఈ గడియారాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం దాన్ని విక్రయించడాని, అప్పటి నుంచి అనేక మంది చేతులు మారుతూ వచ్చినట్లు అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్థ తెలిపింది.






