ఉద్యోగులకు ఫేస్బుక్ షాక్!
ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు ఉద్యోగుల నియామకాలను తగ్గించడమే కాదు, మరోవైపు తొలగింపు ప్రక్రియను కూడా ప్రారంభించాయి. సోషల్ నెట్వర్కింగ్ కంపెనీ మెటా తన ఫేస్బుక్ నుండి ఉద్యోగులను తొలగించబోతోంది. కనీసం 12,000 మంది సిబ్బందిని అంటే సంస్థ శ్రామిక శక్తిలో 15 శాతం కోత విధించాలని కంపెనీ యోచిస్తోంది. కొన్ని మీడియా వర్గాల ప్రకారం పేలవ పనితీరు కనబరుస్తున్న ఉద్యోగులను తొలగించే పనిలో సీనియర్ అధికారులు ఉన్నారు. సోషల్ నెట్వ్ర్కింగ్ దిగ్గజం రిక్రూట్మెంట్ను నిలిపివేసినందున ఫేస్బుక్ స్టార్ భారీగా పతనమైంది. మెటా స్టాక్ ధర ఒక్కో షేరు 380 డాలర్లకి చేరుకుంది. గత ఏడాది కాలంలో కంపెనీ షేరు 60 శాతం పతనమైంది. త్వరలో మరిన్ని తొలగింపులు జరగబోతున్నాయని, అన్ని విభాగాల్లో రిక్రూట్మెంట్ను నిలిపివేస్తున్నట్లు మెటా వ్యవస్థాపకుడు, సిఇఓ మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు.






