ASBL NSL Infratech

నితిన్ కు జోడీగా వ‌ర్ష‌?

నితిన్ కు జోడీగా వ‌ర్ష‌?

నితిన్ హీరోగా వేణు శ్రీ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా యూత్‌ఫుల్ ఎంట‌ర్టైనర్ త‌మ్ముడు. ఈ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూప‌ర్ హిట్ సినిమా టైటిల్ అవ‌డం, దానికి తోడు ప‌వ‌న్ వీరాభిమాని అయిన నితిన్ ఆ టైటిల్ తో సినిమా చేస్తుండ‌టంతో ఈ సినిమాపై అంద‌రికీ ఎంతో ఆస‌క్తి నెల‌కొంది. టైటిల్ తోనే పాజిటివ్ బ‌జ్ ను క్రియేట్ చేయ‌డంలో డైరెక్ట‌ర్ వేణు శ్రీరామ్ స‌క్సెస్ అయ్యాడు.

ఈ సినిమాలో నితిన్ కు జోడీగా సప్త‌మి గౌడ హీరోయిన్ గా న‌టిస్తుంద‌నే వార్తలొచ్చాయి. ఇప్పుడు వ‌ర్ష బొల్ల‌మ్మ ఈ సినిమాలో నితిన్ కు జోడీగా న‌టిస్తుంద‌నే వార్త‌లొస్తున్నాయి. మ‌రి స‌ప్త‌మితో పాటూ వ‌ర్ష కూడా ఈ సినిమాలో న‌టిస్తుందా లేదా వ‌ర్ష ఒక్క‌టే హీరోయినా అన్న‌ది తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే.

ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ల‌య, నితిన్ కు అక్క పాత్ర‌లో న‌టిస్తుంది. దీన్ని బ‌ట్టి చూస్తుంటే ఇది అక్క త‌మ్ముడు సెంటిమెట్ సినిమా అని అర్థ‌మ‌వుతుంది. భారీ బ‌డ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  ఈ సినిమా విష‌యంలో నితిన్, దిల్ రాజు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :