ASBL NSL Infratech

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహణలో – “తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు” సదస్సు విజయవంతం

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వహణలో – “తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు” సదస్సు విజయవంతం

తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వ సమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు” అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది.

తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారం అని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూ పాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.  

తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్న సాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు. .

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ .. “భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యం కలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయవలసిన కృషి ఎంతైనా ఉందన్నారు”     

పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పి. ఎచ్.డి పట్టా అందుకుని, అదే విశ్వవిద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపుకథలకు ప్రత్యేక స్థానంఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపుకథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీ ముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు.

ప్రత్యకఅతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలు మొదలైన సాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగవీక్షణంగా ప్రతిభావంతంగా స్పృశించారు.

విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వ తెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు)  – ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) – ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన మరియు పరిశోధనా విభాగంలో సహాయాచార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనే అంశంపై పి.ఎచ్.డి చేస్తున్న బుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి.                 

పూర్తి కార్యక్రమాన్ని ఈ క్రింది లంకెద్వారా వీక్షించవచ్చును.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :