America : శాంతి చర్చలు ఆగితే రష్యాపై ఆంక్షలు : అమెరికా

రష్యా- ఉక్రెయిన్ (Russia- Ukraine )ల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా (America) తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలను ప్రస్తావిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య శాంతి చర్చలు ఆగిపోతే రష్యా అదనపు ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అమెరికా పార్లమెంటు ఎగువసభ సెనెట్ (Senate) లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి రష్యా తనకు ఉన్న షరతులను పేర్కొంటోంది. అది ఎలాంటి షరతులు పెడుతుందనేది ఇంకా తెలియదు. అవి అందిన తర్వాత యుద్ధం ముగింపుపై రష్యా వైఖరి ఏంటనేది తెలుస్తుంది. ఈసారి చర్చలు ఫలిస్తాయని ఆశిస్తున్నా అని రూబియో పేర్కొన్నారు.