Supreme Court : ఫెడరల్ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు వెళ్తాం : ట్రంప్

జన్మత పౌరసత్వం ఇచ్చే నిబంధన ప్రాథమికంగా బానిసల పిల్లల కోసమే తప్ప యావత్ ప్రపంచం ఇక్కడికి వచ్చి పోగుపడటానికి ఉద్దేశించినది కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అన్నారు. అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలినాడే ట్రంప్ జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కార్యనిర్వహక ఆదేశాలు జారీ చేశారు. అయితే మరునాడే ఆ ఆదేశాలను సియాటెల్‌లోని ఒక ఫెడరల్ కోర్టు (Federal Court) కొట్టివేసింది. దీనిపై అప్పీలుకు వెళ్తామని ట్రంప్ ప్రకటించారు. సుప్రీంకోర్టు (Supreme Court) తనకు అనుకూలంగా తీర్పు వెలువరిస్తుందని ఆయన తాజాగా ఆశాభావం వ్యక్తం శారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తున్నారు. ఏమాత్రం అర్హతలేని వారు ఇక్కడికి వచ్చి పిల్లల్ని కంటున్నారు. జన్మత పౌరసత్వం అనేది అమెరికాకు బానిసలుగా వచ్చిన వారి పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఉదాత్తమైన సౌకర్యం. నాకు అది 100 శాతం నమ్మతమే. జన్మత పౌరసత్వం యావత్ ప్రపంచం వచ్చి అమెరికా(America)ను ఆక్రమించుకోవడానికి ఉద్దేశించినది కాదు అని ఆయన అన్నారు.