Marco Rubio : తక్షణం ఉద్రిక్తతలను తగ్గించండి : అమెరికా విదేశాంగ మంత్రి రూబియో

భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించే దిశగా రెండు దేశాలూ చర్చలు చేపట్టాల్సిన అవసరం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలకు ఏ రూపంలోనూ మద్దతు అందకుండా చూడాలని పాక్‌కు మరోసారి సూచించారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ (Jaishankar )రూబియోతో ఫోన్లో మాట్లాడారు. ఉద్రిక్తతను పెంచేందుకు పాక్ ఎలాంటి ప్రయత్నం చేసినా తగినవిధంగా తాము స్పందిస్తామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరులో భారత్ (India)కు బాసటగా ఉంటామని రూబియో ప్రకటించడాన్ని కొనియాడారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif ) తోనూ రూబియో ఫోన్‌లో మాట్లాడారు. సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రతను పరిరక్షించుకునే హక్కు పాకిస్థాన్‌కు ఉందని షరీఫ్ చెప్పినట్లు తెలిసింది.