Marco Rubio: చైనా విద్యార్థుల వీసాలు రద్దు చేస్తాం : మార్కో రూబియో

అమెరికాలో చదువుతున్న చైనా విద్యార్థుల్లో కొందరి వీసాలు రద్దు చేయనున్నట్లు విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో (Marco Rubio) ప్రకటించారు. వారిలో చైనా కమ్యూనిస్టు పార్టీ (Communist Party)తో సంబంధాలున్నవారు కూడా ఉంటారని ఆయన వెల్లడిరచారు. 2023-24 విద్యా సంవత్సరంలో 2.7 లక్షల మందికి పైగా చైనా విద్యార్థులు (Chinese students) అమెరికాలో ప్రవేశాలు పొందారు. మొత్తం విదేశీ విద్యార్థుల సంఖ్యలో ఇది నాలుగో వంతు. అమెరికా (America) నిర్ణయంపై చైనా విద్యార్థుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది 19వ శతాబ్దంలో అమెరికా రూపొందించిన చైనీస్ ఎక్స్‌క్లూజన్ యాక్ట్ (Chinese Exclusion Act) కు సరికొత్త రూపమని జాన్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఒక చైనా విద్యార్థి వాపోయాడు. నాటి చట్టం ప్రకారం అమెరికాకు చైనీయులు వలస నిషిద్ధం. అంతకు ముందే అమెరికాలో స్థిరపడిన చైనీయులకు పౌరసత్వం ఇవ్వడంపై కూడా ఆ చట్టం నిషేధం విధించింది.